బాలయ్య సంచలన నిర్ణయం.. సంస్థ కార్యకలాపాలు నిలిపివేత?
Recommended Video

ఎన్నో ఏళ్లుగా సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు 'ఎన్టీఆర్ బయోపిక్' ద్వారా తన కల నెరవేర్చుకున్నారు. తన తండ్రి బయోపిక్ తీయడం కంటే గొప్ప ప్రారంభం ఏమీ ఉండదనే ఆలోచనతో 'ఎన్.బి.కె ఫిల్మ్స్' అనే నిర్మాణ సంస్థ స్థాపించారు.
'ఎన్టీఆర్ బయోపిక్' బాక్సాఫీసు వద్ద చరిత్ర సృష్టిస్తుందని ఊహించిన బాలయ్య అంచనాలు తారుమారయ్యాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన సినిమా ఊహించని విధంగా, అత్యంత దారుణంగా పరాజయం పాలైంది.

బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద లాస్
‘ఎన్టీఆర్ బయోపిక్' బాలయ్య కెరీర్లోనే బయ్యర్లకు అతిపెద్ద లాస్ తెచ్చిన చిత్రంగా నిలిచింది. మొదటి భాగం కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 50 కోట్లు నష్టపోయగా... రెండో భాగాన్ని ఎలాంటి ముందస్తు అడ్వాన్సులు లేకుండా ఫ్రీగా ఇచ్చారు. వచ్చే కలెక్షన్ మీద డిస్ట్రిబ్యూటర్‌కు 40 శాతం, నిర్మాతకు 60 శాతం దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా చేసినా కూడా డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు 10శాతం కూడా తీరలేదు.

బిగ్గెస్ట్ ప్లాప్ ‘మహానాయకుడు'
ఫిబ్రవరి 22న విడుదలైన ‘మహా నాయకుడు' బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి. ఈ సినిమా ఫలితం బాలయ్యను చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ పరిణామాలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అతడిని నడిపించినట్లు తెలుస్తోంది.

ఎన్.బి.కె ఫిల్మ్స్ కార్యకలాపాలు నిలిపివేత?
నిర్మాతగా తొలి అడుగులోనే ఊహించని పరాజయం ఎదురవ్వడంతో బాలయ్య కొంతకాలం పాటు ఎన్.బి.కె ఫిల్మ్స్ కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పట్లో ఆయన నుంచి నిర్మాతగా ఎలాంటి సినిమా రాక పోవచ్చని టాక్.

బోయపాటి సినిమా నిర్మించేది ఎవరు?
‘ఎన్టీఆర్ బయోపిక్' విడుదలవ్వడానికి ముందే బోయపాటితో బాలయ్య సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాను కూడా తానే నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. అయితే ఇపుడు తన నిర్ణయం మార్చుకున్నారట. మరి బాలయ్యతో బోయపాటి తీయబోయే సినిమాను నిర్మించడానికి ఎవరు ముందుకు వస్తారనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











