‘కల్కి’గా రాబోతున్న బాలకృష్ణ?
నందమూరి అగ్రహీరో బాలయ్య దూరంగా దగ్గరగా ఫేం రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కల్కి అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. బాలయ్య తొలిసారిగా హీరోయిన్ పార్వతి మెల్టన్ తో రొమాన్స్ చేస్తున్నాడు ఈ చిత్రంలో. పార్వతికి చాలా కాలం తర్వాత ఓ భారీ బడ్జెట్, పెద్ద హీరో సరసన లీడ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.
రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పకులు. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలయ్య పరుచూరి మురళి దర్శకత్వంలో 'అధినాయకుడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











