ఆగిపోయిన యువరత్న బాలకృష్ణ 'నర్తనశాల' ప్రారంభంకానుందా??
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రం 'నర్తనశాల'. సావిత్రి, ఎస్వీ రంగారావు, ముక్కామల తదితరులు నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నటవారసుడు యువరత్న బాలకృష్ణ తీద్దామని సంకల్పించారు. కానీ ఈ చిత్రంలో ద్రౌపతిగా నటించాల్సిన సౌందర్య దుర్మరణం చెందటం లాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత 'లగాన్' ఫేం గ్రేసీ సింగ్ ను ద్రౌపతిగా నటింపజేస్తూ తిరిగి సినిమా ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించాయి, కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ చిత్రం గురించి ఎలాంటి వార్త రాలేదు. కానీ తాజా సమాచారం ఏంటంటే బాలయ్య తిరిగి ఈ సినిమాని ప్రారంభించాలని సంకల్పించారట. టాలీవుడ్ సరికొత్త సంచలనం 'మగధీర' చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఎన్నుకున్నారట. ఈ వార్తలు కానీ నిజమయితే మరో సాంకేతిక అద్భుతాన్ని మనం చూడబోతున్నామనమాట. మరి సౌందర్య చెయ్యాల్సిన ద్రౌపతి పాత్రకు ఎవరిని ఎన్నుకుంటారో అన్న ప్రశ్నకు సమాధానంగా స్నేహ పేరు బలంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











