»   » బాలయ్య బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నారా..?

బాలయ్య బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నారా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నారా.. ? అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. కీర్తి కంబైన్స్ సినిమాకో కోత్త విగ్ తో తనదైన స్టయిల్ చుపించే యువరత్న తాజాగా పరుచూరి మురళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కోత్త విగ్ పెట్టుకోని దర్శనమిస్తున్నాడు. ఆయన అంతటితోటి ఆగకుండా, స్టయిలిష్ కాస్టూమ్స్ తో పవన్ కళ్యాణ్ మార్కు స్టిల్స్ తో బాలయ్య ఈ చిత్రం కోసం యూత్ పుల్ ఫోటోసెషన్ చేయించుకున్నారు.

పవన్ కళ్యాణ్ జల్సా మాదిరిగా బాలయ్య తన రెండు చేతుల్ని జీన్స్ ప్యాంట్ ప్రంట్ పాకెట్ లో పెట్టుకోని నాటీ స్మయిల్ తో ఫాన్స్ లో వైబ్రేషన్స్ పుట్టస్తున్నారు. బాలయ్య సినిమా స్టిల్స్ అంటే సహజంగా నెత్తురోడుతున్న బాలయ్య ముఖమో, లేదా సింహం బ్యాక్ గ్రౌండ్ తో రాజసంగా నడిచోస్తున్న భంగిమో ఉంటాయి. కాని ఈ సారి అందుకు భిన్నంగా బాలయ్య యూత్ ని ఆకట్టుకునే విధంగా ఫోజులు యిచ్చారు. నిజానికి ఇదంతా బాలయ్య బాబు కి సరిపడదు కదా.

పరుచూరి మురిళి బాలకృష్ణకు న్యూలుక్ ఇద్దామని ఇలా చేశాడేమో లేక బాలయ్య జీవితంలో మరోక మైలుని అందించడానికి ప్లాను చేశాడేమో చూద్దాం. తన తోటి హీరోలు అందరూ రిటైర్ అవుతుంటే బాలయ్య బాబు మాత్రం ఏజ్ గురించి ఆలోచించకుండా రోజు రోజుకి కుర్రోడై పోతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu