అజ్ఞాతవాసి డిస్టిబ్యూటర్ల విలవిల.. జై సింహ కళకళ.. పవన్‌కు బాలయ్య కౌంటర్

By Rajababu

Recommended Video

అజ్ఞాతవాసి vs జై సింహ, డిస్టిబ్యూటర్ల విలవిల : పవన్‌కు కౌంటర్

టాలీవుడ్‌కు సంక్రాంతి పండుగ కొంత నిరాశను, మరికొంత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది పండుగ రేసులో విడుదలైన అజ్ఞాతవాసి, జై సింహా, గ్యాంగ్, రంగులరాట్నం చిత్రాలు ప్రేక్షకులకు, డిస్టిబ్యూటర్లకు నిరాశనే మిగిల్చాయి. అయితే జై సింహా కలెక్షన్లు పుంజుకోవడం కొంత ఉపశమనంగా మారింది. అయితే అజ్ఞాతవాసి, జై సింహా డిస్టిబ్యూటర్ల గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 అజ్ఞాతవాసికి 80 కోట్ల నష్టం

అజ్ఞాతవాసికి 80 కోట్ల నష్టం

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. అజ్ఞాతవాసి చిత్రం సుమారు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా. దీంతో ప్రాంతాల వారీగా డిస్టిబ్యూటర్లకు ఊహించిన నష్టాలు ఎదురవ్వడానికి అవకాశం ఉంది. కానీ పంపిణీదారులను ఆదుకొనేందుకు చిత్ర నిర్మాత, దర్శకులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

డిస్టిబ్యూటర్లకు అండగా

డిస్టిబ్యూటర్లకు అండగా

వాస్తవానికి డబ్బు తిరిగి చెల్లించే ఒప్పందం అజ్ఞాతవాసి డిస్టిబ్యూటర్లకు, నిర్మాతకు మధ్య లేదు. కానీ మానవీయ కోణంలో పంపిణీదారులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

 ఇచ్చేది లేదని.. పవన్

ఇచ్చేది లేదని.. పవన్

అజ్ఞాతవాసి హక్కులను భారీ మొత్తాలకు చేజిక్కించుకొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు సొమ్ము తిరిగి ఇచ్చేది లేదని ఇప్పటికే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. లాభాలు వచ్చినప్పుడు డిస్టిబ్యూటర్లు ఏమైనా తిరిగి ఇచ్చారా అనే పవన్ అన్నట్టు సినీవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

15 కోట్లు ఇవ్వడానికి

15 కోట్లు ఇవ్వడానికి

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డిస్టిబ్యూటర్లను ఆదుకొనేందుకు త్రివిక్రమ్ ముందుకొచ్చారట. త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్‌లో సుమారు రూ.5 కోట్లు వెనుకకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నిర్మాత కూడా రూ.10 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. దాదాపు రూ.15 కోట్ల మేర నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది లేటేస్ట్‌గా తెలిసింది.

50 కోట్ల క్లబ్‌లో బాలయ్య

50 కోట్ల క్లబ్‌లో బాలయ్య

ఇదిలా ఉండగా, అజ్ఞాతవాసి ఫ్లాప్ టాక్ నేపథ్యంలో జై సింహా కలెక్షన్లు భారీగా పుంజుకోవడం విశేషంగా మారింది. బాలయ్య సినిమా ఏకంగా రూ.50 క్లబ్‌లో చేరడంతో జై సింహా డిస్టిబ్యూటర్లు చాలా సంతోషంతో కనిపించారు.

దూసుకెళ్తున్న జై సింహా

దూసుకెళ్తున్న జై సింహా

జై సింహా కలెక్షన్లపరంగా దూసుకుపోతున్న నేపథ్యంలో జై సింహా సక్సెస్ మీట్‌ను నిర్మాత సీ కల్యాణ్ నిర్వహించారు. సక్సెస్ మీట్‌లో డిస్టిబ్యూటర్లందరితో నిర్మాత మాట్లాడించడం అందర్ని ఆకట్టుకొన్నది. జై సింహా చిత్రం తమకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది అని ప్రతీ డిస్టిబ్యూటర్ వేదికపై చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 బాక్సాఫీస్ బొనాంజా అంటూ

బాక్సాఫీస్ బొనాంజా అంటూ

ఇక బాక్సాఫీస్ బొనాంజా అంటూ బాలయ్యను నిర్మాత కల్యాణ్ ఆకాశానికి ఎత్తేశాడు. కేవలం తక్కువ వ్యవధిలో సినిమాను పూర్తి చేయడమే కాకుండా నిర్మాణ వ్యయం పెరిగిపోకుండా కూడా బాలయ్య సహకరించారని చెప్పడం గమనార్హం.

డిస్టిబ్యూటర్లకు అండగా

డిస్టిబ్యూటర్లకు అండగా

జై సింహా సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే డిస్టిబ్యూటర్లకు ఎప్పుడు తన అండ ఉంటుంది అని స్పష్టం చేశారు. డిస్టిబ్యూటర్లు బాగుంటనే సినీ పరిశ్రమ కళకళలాడుతుంది అని బాలయ్య చెప్పడం గమనార్హం.

పవన్ కామెంట్స్

పవన్ కామెంట్స్

డిస్టిబ్యూటర్లను ఆదుకోలేదనే కారణంతో ఓ నిర్మాతను పవన్ పక్కన పెట్టారనే ఓ వార్త ప్రచారంలో ఉంది. దానిని ఉద్దేశించే అజ్ఞాతవాసి ఆడియోలో ఆయనపై పరోక్షంగా కామెంట్లు చేశారనే సినీ వర్గాల్లో ప్రచారమైంది.

 సినీ వర్గాల్లో చర్చకు

సినీ వర్గాల్లో చర్చకు

తాజాగా అజ్ఞాతవాసి నష్టపోయిన పంపిణిదారులను పవన్ ఆదుకోకపోవడం, జైసింహా డిస్టిబ్యూటర్లకు బాలయ్య అండగా ఉంటానని చెప్పడం సినీవర్గాల్లో చర్చకు దారి తీసిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X