బాలకృష్ణ, కృష్ణవంశీ చిత్రం టైటిల్ అదా?
బాలకృష్ణ..'సింహా' హిట్ అవటంతో అందరి దర్శకుల దృష్టి ఆయనపై పడిన సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాధ్ తో బాలయ్య సినిమా మొదట అనుకున్నా కథ కుదరక ఆగటంతో ఆ స్లాట్ లోకి కృష్ణ వంశీ వచ్చి చేరారని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రంకి టైటిల్ 'భీష్మ' అని నిర్ణయించారని చెప్తున్నారు. ఆ టైటిల్ తో ఇంతకుముందు రమేష్ వర్మ..బాలయ్య కాంబినేషన్ లో బెల్లంకొండ 'భీష్మ' టైటిల్ తో చిత్రం ప్రారంభించారు. అయితే ఆ కథ నచ్చక బాలకృష్ణ రిజెక్టు చేయటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే అప్పుడు తన బ్యానర్ పై రిజిస్టర్ చేసిన ఆ టైటిల్ తో బెల్లంకొండ కృష్ణవంశీనితెచ్చి ముందుకు నెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పరమవీర చక్ర అనంతరం ఉంటుందని వినిపిస్తోంది. మరో ప్రక్క మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ నటించటానికి బాలయ్య కమిటయ్యన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ పరమవీర చక్ర కృష్ణ వంశీ పూరీ జగన్నాధ్ భీష్మ మెహర్ రమేష్ simha balakrishna krishna vamsi paramaveera chakra puri jagannath


Click it and Unblock the Notifications