బాపు దర్సకత్వంలో పౌరాణిక పాత్రలో బాలకృష్ణ
ఎన్టీఆర్, అంజలీదేవి, చిత్తూరు నాగయ్య, కాంతారావు ప్రధాన పాత్రధారులుగా రావు సిఎస్‌ఆర్, సి.పుల్లయ్య సంయుక్త దర్శకత్వంలో 1963లో రూపొందిన మైథలాజికల్ క్లాసిక్ 'లవకుశ". ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో రీమేక్ చేయడానికి ప్రముఖ దర్శకుడు బాపు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. అప్పట్లోనే కలర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మరోసారి కలర్‌లో, లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు బాలకృష్ణ ఎన్‌టిఆర్ నటించిన పాండురంగ మహాత్మ్యం చిత్రాన్ని పాండురంగడు పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'పరమవీర చక్ర"లో బాలకృష్ణ రావణబ్రహ్మ గెటప్‌లో కనిపించనున్నారు.సీతారామ కళ్యాణం, సంపూర్ణ రామాయణం, ఈటీవీ భాగవతం వంటి పౌరాణాలను అధ్బుతంగా తెరకెక్కించిన బాపు ఈ చిత్రాన్ని మరో క్లాసిక్ గా తీర్చగలరని ఆశించవచ్చు.
బాలకృష్ణ బాపు ముళ్ళపూడి వెంకటరమణ సీతారామ కళ్యాణం సంపూర్ణ రామాయణం balakrishna bapu mullapudi venkata ramana seetha rama kayalyanam sampurna ramayanam


Click it and Unblock the Notifications