»   » రాజమౌళా?: మహేష్, బాలయ్య ఫ్యాన్స్ అస్సలు నమ్మడం లేదు!

రాజమౌళా?: మహేష్, బాలయ్య ఫ్యాన్స్ అస్సలు నమ్మడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ రంగానికి చెందిన కొన్ని వార్తలు, రూమర్స్ వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి...కానీ కొన్ని సందర్భాల్లో అవి నమ్మశక్యంగా అనిపించవు. అలాంటి ఓ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్లో టాప్ హీరోస్ ఎవరంటే ఎక్కువ మంది చెప్పే పేరు మహేష్ బాబు. నెం.1 డైరెక్టర్ అంటే రాజమౌళి తప్ప మరొక ఆప్షన్ లేదు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు సినిమా చేయలేదు. అయితే మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం తెలుగు ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఫీలవ్వడం ఖాయం.

వీరిద్ద‌రూ క‌లిసి ఎప్ప‌టి నుంచో సినిమా చేయాల‌నుకుంటున్నమాట వాస్తవమే. కానీ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, స్టోరీ కుదరక పోవడంతో ఇప్ప‌టి వ‌ర‌కు వీలే కాలేదు. మ‌హేష్, రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.ఎల్.నారాయ‌ణ నిర్మిస్తున్నట్లు గతంలో ఆయన మీడియా ముఖంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కెఎల్ నారాయణ స్వయంగా ప్రకటించడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందో? అంటూని రకరకాలు ఊహాగానాలు వినిపించాయి. కొంత కాలం తర్వాత రాజ‌మౌళి మ‌హేష్ తో జేమ్స్ బాండ్ త‌ర‌హాలో యాక్ష‌న్ మూవీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

రాజమౌళి బాహుబలి మొదలు పెట్టిన తర్వాత.....ఈ వార్తలన్నీ కనుమరుగైపోయి. ఎందుకంటే బాహుబలి ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత రాజమౌళి ఇతర సినిమాల గురించి ఆలోచించడం మానేసాడు. అయితే ఉన్నట్టుండి ఓ నమ్మశక్యం కాని రూమర్ ఒకటి గుప్పుమంది.

మల్లీ స్టారర్? అంటూ...

మల్లీ స్టారర్? అంటూ...


మ‌హేష్ తో రాజ‌మౌళి చేయ‌నున్న సినిమా మ‌ల్టీస్టార‌ర్ అట‌. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించనున్నార‌ట‌.

అవునా?

అవునా?


విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వీరిద్ద‌రికి స‌రిపోయే విధంగా క‌థ రెడీ చేస్తున్నారట. ఈ విష‌యం గురించి ఇటీవ‌ల మ‌హేష్ తో చ‌ర్చించ‌గా...బాల‌కృష్ణ తో క‌లిసి సినిమా చేయ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.

నమ్మడం లేదు

నమ్మడం లేదు


ఈ రూమర్స్ ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

అదే నిజమైతే అదో మెరాకిల్

అదే నిజమైతే అదో మెరాకిల్


ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా ఈ వార్త నమ్మశక్యంగా లేదని అంటున్నారు. అదే నిజమౌతే అదో మెరాకిలే అంటున్నారు.

English summary
Film Nagar gossip is that, Nadhamuri Balakrishna has given the green signal for multi starrer movie, ... Some opine that there is more chance of selecting Mahesh babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu