twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందుకు ఇలా జరిగింది?.. అభిమానులతో బాలయ్య మీటింగ్?

    |

    'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రాన్ని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నిర్మాణ బాధ్యతలు కూడా మరొకరి చేతిలో పెట్టకుండా తానే స్వయంగా 'ఎన్.బి.కె.ఫిల్మ్స్' సంస్థను స్థాపించి నిర్మించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ ఊహించని రీతిలో బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

    సినిమా రంగంలో జయాపజయాలు సర్వసాధారణం. అయితే 'ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో ఎదురైంది మామూలు అపజయం కాదు, అత్యంత నిరాశ పరిచే రీతిలో, 'మహానాయకుడు' చిత్రానకి కొన్ని చోట్ల థియేటర్ల రెంట్లు కూడా రాబట్టలేని విధంగా దారుణమైన ఫలితాలు నమోదైటన్లు సమాచారం.

    అసంతృప్తిలో బాలయ్య

    అసంతృప్తిలో బాలయ్య

    సాధారణంగా బాలయ్య ఏ మూవీ చేసినా... తనవంతుగా బాధ్యత నిర్వర్తిస్తారు, శక్తిమేర కష్టపడతారు. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ‘ఎన్టీఆర్ బయోపిక్' ఫలితంపై మాత్రం ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ఎందుకు ఇలా జరిగింది? అనే విషయాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారట.

    అన్ని ఏరియాల వారితో...

    అన్ని ఏరియాల వారితో...

    తాజాగా సమాచారం ప్రకారం త్వరలో బాలయ్య తన అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల అభిమాన సంఘాల అధ్యక్షులను కలిసి ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    లోపం ఎక్కడ ఉంది?

    లోపం ఎక్కడ ఉంది?

    ‘ఎన్టీఆర్ బయోపిక్' ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం ఏమిటి? లోపం ఎక్కడ ఉంది? అసలు అభిమానులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఎలాంటి టాక్ ఉంది అనే అంశాలు ఈ మీటింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారట. త్వరలో హైదరాబాద్‌లో ఈ మీటింగ్ జరుగబోతున్నట్లు టాక్.

    అభిమానుల నుంచి సలహాలు

    అభిమానుల నుంచి సలహాలు

    బోయపాటి దర్శకత్వంలో త్వరలో సినిమా చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనే అంశాలను ఈ మీటింగ్ ద్వారా బాలయ్య తెలుసుకునే ప్రయత్నం చేస్తారని సమాచారం.

    ఎన్టీఆర్-మహానాయకుడు

    ఎన్టీఆర్-మహానాయకుడు

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్-మహానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా తొలి 3 రోజుల్లో రూ. 3.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఫుల్ రన్‌లో టోటల్ కలెక్షన్ కనీసం 10 కోట్ల షేర్ మార్కును అందుకుంటుందో.. లేదో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Film Nagar source said that, Balakrishna has called for a meeting with fans presidents of all areas in Telugu states very soon about NTR Biopic failure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X