బాలకృష్ణ శక్తినంతా దారపోసిన ‘సింహా’!!
'మిత్రుడు' సినిమా అనంతరం బాలయ్య 'సింహా' శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం పై అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. దీని కోసం దర్శకుడు బోయపాటి శీను ఈ చిత్రాన్ని పెద్ద హిట్ ఇవ్వాలని కసితో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో 'నేను మాట్లాడేటప్పుడు ఈ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీ నెక్ట్స్ బర్త్‌డే ఉండదు" అని బాలయ్య మాట్లాడిన డైలాగ్ అందరిని క్లాప్స్ కొట్టేలా చేసింది.
శ్రీను గత చిత్రాలు 'భద్ర', 'తులసి' మాదిరిగానే యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్స్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు బోయపాటి శ్రీను చెప్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత మీడీయాకు తెలిపారు. ఏకధాటిగా ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ చేస్తున్నాం. ఇటీవలే ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకత్వంలో బాలకృష్ణ, నమితలపై ఓ పాటను చిత్రీకరించాం. బాలకృష్ణ, స్నేహా ఉల్లాల్, ఆదిత్య మీనన్ తదితరులపై ఉత్కంఠభరితంగా చేజ్ సీన్ ను చిత్రీకరిస్తున్నాం. సంక్రాంతి కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











