Balakrishna: బోయపాటితో మళ్లీ బాలకృష్ణ సినిమా.. ఏపీ ఎన్నికలే టార్గెట్.. వాటికి ముందే విడుదల!
సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో తెరంగేట్రం చేసిన తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టిన బాలయ్య బాబు ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న బాల్యయ బాబు మరోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

బాలయ్య క్రేజ్..
నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సాధించాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో మారు మోగాల్సిందే. ఇక ఇటీవల బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం వీర సింహా రెడ్డి.

హోస్ట్ గా మారి..
అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఒక సినిమాను లైన్ లో పెట్టాడు ఈ నట సింహం. ఇలా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోయే బాలకృష్ణ ట్రెండ్ కి తగినట్లుగా నడుచుకుంటారు. అందులో భాగంగానే అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. తెలుగు టాక్ షోలలో అన్నిటింకంటే క్రేజ్ వచ్చేలా హోస్ట్ గా తన మార్క్ చూపించాడు.

ఫస్ట్ లుక్ కు భారీగా..
ప్రస్తుతం టాక్ షోలు, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. మరకొటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాలోని బాలయ్య ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దానికి భారీ రెస్పాన్స్ లభించింది.

డబుల్ హ్యాట్రిక్ కొట్టేలా..
ఇక బోయపాటి శ్రీను-బాలయ్య బాబు కాంబినేషన్ అంటే క్రేజ్ మాములుగా ఉండదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ కొట్టాయో తెలిసింది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను, బాలయ్య బాబు తాజాగా రూపొందించే సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

శరవేగంగా చిత్రీకరణ..
అయితే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమాను రాజీకయ నేపథ్యంలో తీస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే ముందుగానే అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఆల్రెడీ కథ, స్క్రీన్ ప్లే లాక్ చేశారాని, సినిమా ప్రారంభోత్సవానికి ముహుర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఆగస్టు వరకు పూర్తి అవుతాయని తెలుస్తోంది.

ఎలక్షన్స్ కంటే ముందుగా..
అనిల్ రావిపూడి సినిమా పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు బోయపాటితో సినిమా ప్రారంభించనున్నారట. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న లాంఛనలంగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి.. ఆగస్టు తర్వాత షూటింగ్ కు వెళ్తారట. ఇక చిత్రీకరణ త్వరగా పూర్తి చేసి 2024 మొదటి రెండు, మూడు నెలల్లో విడుదల చేయాలనేది ప్లాన్ అని సమాచారం. అంటే ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చినట్లుగా పొలిటకల్ పంచ్ డైలాగ్ లు సమాజంలో సమస్యలను ఎత్తి చూపే విధంగా ఎలక్షన్స్ కంటే ముందుగా విడుదల చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











