ఎలాగైనా సరే కాజలే కావాలని పట్టు బట్టిన బాలకృష్ణ ..?
జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లతో తప్పక రొమాన్స్ చేయడానికి ప్రయత్నించే బాలకృష్ణ 'బృందావనం" దగ్గర్నుంచి కాజల్ కోసం పట్టుబడుతున్నాడు. అయితే వయసులో పెద్ద వాళ్లయిన హీరోలతో నటించరాదని నిర్ణయించుకున్న కాజల్ మరీ బాలయ్య, వెంకీ లాంటి హీరోలతో నటించనని ఖచ్చితంగా చెప్పేస్తోంది. వాళ్ల సరసన కూతురిలా కనిపిస్తానంటూ నిర్మొహమాటంగా తేల్చి చెబుతోంది..
అయితే బాలయ్య మాత్రం కాజల్ ని ఎలాగైనా తన తదుపరి సినిమాలో పెట్టుకోవాలని చూస్తున్నాడు. హీరోల ఇష్టాలని తీర్చడంలో స్పెషలిస్టు అని ముద్ర పడ్డ బెల్లంకొండ సురేష్ 'హరహర మహాదేవ" చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఇందులో కాజల్ ని హీరోయిన్ గా బుక్ చేసేందుకు చాలా విధాలుగా ట్రై చేస్తున్నాడు. అయితే అలా చేస్తే తనతో మళ్లీ మళ్లీ నటిస్తున్న యువ హీరోలిక తన ముఖం కూడా చూడరని కాజల్ జాగ్రత్త పడుతోంది..అయితే ఓ కోణంలో త్రిషను సెలక్ట్ చేసినట్టు సమాచారం...


Click it and Unblock the Notifications











