బాలకృష్ణ, బోయపాటి మూవీ ‘రూలర్’!
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వరుస ప్లాపులతో ఉన్న బాలయ్య 'సింహా'తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారు. తాజాగా వీరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది.

బాలయ్యకు తగిన పవర్ ఫుల్ కథతో బోయపాటి సిద్ధం అవుతున్నారని, ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ పెట్టే యోచనలో దర్శకుడు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈచిత్రానికి నిర్మాతలు ఎవరు? ఇతర తారగణం, సాంకేతిక వర్గ వివరాలు మాత్రం తెలియరాలేదు. ఏది ఏమైనా ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది.
'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ బాలయ్య పచ్చజెండా ఊపలేదు. రకరకాల వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకూ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారట. క్రేజీ రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తున్నారట. ఈ చిత్రానికి నిర్మాత, తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


Click it and Unblock the Notifications











