twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'రూలర్‌' టార్గెట్ ఏమిటంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ రిపీట్ చేస్తూ రూపొందనున్న చిత్రం 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు ఈ చిత్రం ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించింది. మరోసారి బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించేందుకు రంగం సిద్ధమైంది.

    రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రూలర్‌' అనే టైటిల్‌ ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాం అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సిబ్బందిని ఇంకా ప్రకటించవలసి వుంది. బాలయ్యకు తగిన పవర్ ఫుల్ కథతో బోయపాటి సిద్ధం అవుతున్నారు. బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఇటీవల విడుదలై ప్లాప్ అయ్యింది.

    మరో ప్రక్క బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. 'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ బాలయ్య పచ్చజెండా ఊపలేదు. రకరకాల వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకూ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. అయితే బోయపాటి శ్రీను చిత్రం మాత్రం లైన్ లో ఉన్నట్లు ఖచ్చితంగా చెప్తున్నారు.

    English summary
    Plans were on to release Balakrishna's Ruler just before the 2014 General Elections to give a big boost to the morale of fans and party workers. The combination of Balakrishna and Boyapati rocked the Box Office with Simha which is one of the biggest hits in the Industry. Hope they repeats the magic!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X