జీవీ దర్శకత్వంలో బాలయ్య?
తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ చిత్రానికి సుధాకర్ నాయుడు అలియాస్ జీవి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. జీవి ఇది వరకు నితిన్ కథానాయకుడుగా 'హీరో", శ్రీకాంత్ కథానాయకుడుగా 'రంగా ది దొంగ" చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డవే. అయినా సరే బాలయ్య జీవిపై నమ్మకం పెట్టి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఈ విషయం ఇప్పడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం బాలయ్య బాపు దర్శకత్వంలో బాలయ్య నటించిన 'శ్రీరామరాజ్యం'చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయుడు' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే మంచు మనోజ్ తో 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', వీటితో పాటు బి గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంతో పాటు, జయంత్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత జీవి-బాలయ్య కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











