బాలకృష్ణ కమిటైన కొత్త చిత్రం...డిటేల్స్

By Srikanya

బాలకృష్ణ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆయన శ్రీవాస్‌ (లక్ష్యం ఫేమ్‌) దర్శకత్వంలో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఈ కొత్త చిత్రం ఈ వారంలోనే మొదల కానుందని తెలుస్తోంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్టుపై శ్రీవాస్ చాలా కాలంగా కసరత్తులు చేసారని,విన్న వెంటనే బాలకృష్ణ ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ అధినాయకుడు డబ్బింగ్ లో ఉన్నారు.

ఈ చిత్రమే కాకుండా మరికొన్నింటిని బాలకృష్ణ అంగీకారం తెలపాల్సి ఉంది. అలాగే రవి చావలి దర్శకత్వంలో రూపొందే శ్రీమన్నారాయణ చిత్రం కూడా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఎల్లో ఫ్లవర్స్‌ సంస్థలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ...జర్నిలిస్ట్ గా ఓ విభిన్నమైన పాత్రలో కనపిస్తారు. మరో ప్రక్క మోహన్ బాబు నిర్మాణ సంస్ధలో రూపొందుతున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'లో ప్రత్యేక పాత్రని చేస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందే ఆ చిత్రంలో మంచు మనోజ్ హీరోగా చేస్తున్నారు. బాలకృష్ణ పాత్ర స్పూర్తితో మంచు మనోజ్ పాత్ర చేసే విన్యాసాలు అదరకొడతాయంటున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న భారీ ఖర్చుతో ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణ వంశీ శిష్యుడు రాజా ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

'సింహా'తో సక్సెస్‌ కొట్టి ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత బాపు దర్శకత్వంలో చేసిన 'శ్రీరామరాజ్యం' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దీనికి పూర్తిగా భిన్నంగా మరోవైపు అధినాయకుడు పూర్తిచేశారు. ఇందులో ఆయన మూడు పాత్రలు చేయడం విశేషం. బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని ఎ సర్టిపికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ టాక్ బాగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. సినిమా ప్రారంభమైన నాటి నుంచి నెగిటివ్ టాక్ ను మూట గట్టుకున్న ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు' రాబోతోంది.

దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.

తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X