హాట్ న్యూస్ :బాలకృష్ణ కొత్త చిత్రానికి టైటిల్ దొరికింది

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ తాజా చిత్రానికి గాడ్సే అనే టైటిల్ పెడదామని నెగిటివ్ టైటిల్ అవుతుందని ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారియర్ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే బాలయ్య ఆసక్తి చూపించలేదని చెప్పుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కొత్త చిత్రానికి , 'లయిన్' అని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. సింహా సూపర్ హిట్టవటంతో అదే పవర్ గల టైటిల్ ని వెతికి ఇది ఫైనల్ చేసే అవకాసం ఉందని అంటోంది. 'లెజండ్' టైటిల్ సైతం ల తో ప్రారంభం కావటం అదీ ఘన విజయం సాధించటం తో ఈ టైటిల్ పైనే దర్శక,నిర్మాతలు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ నిర్ణయంతీసుకోవటమే మిగిలిందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా చేస్తున్నారు. బాలకృష్ణ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Balakrishna new movie title Lion?

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X