పవన్ దర్శకుడుతో...బాలకృష్ణ తదుపరి చిత్రం
పవన్ కళ్యాణ్ తో ఖుషీగా చిత్రం డైరక్ట్ చేస్తున్న జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించటానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు చిత్రాల అనంతరం జయంత్ చిత్రం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇప్పటికే జయంత్...బాలకృష్ణని కలిసి ఓ కథని నేరేట్ చేసి ఒప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి పూర్తి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీనరసింహ" చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి పిడుగు చిత్రం డిజాస్టర్ గా భాక్సాపీస్ వద్ద నమోదు అయిన సంగతి తెలిసింది. ఇక 'సింహా" విజయంతో మంచి ఊపుమీదున్న బాలకృష్ణ వరస చిత్రాలుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దాసరి దర్శకత్వంలో 'పరమవీర చక్ర", పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు.
More from Filmibeat
బాలకృష్ణ జయంత్ పరాంన్జీ సింహా పరుచూరి మురళి పరమవీర చక్ర balakrishna simha paruchuri murali parama veera chakra allari pidugu


Click it and Unblock the Notifications











