Don't Miss!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
రజనీకాంత్ డైరక్టర్ తో...బాలకృష్ణ నెక్ట్స్
దాంతో రవికుమార్ దర్శకత్వంలో చేయటానికి బాలకృష్ణ ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ని తెరపై విజిల్స్ వేయించేలా తీయటంలో ఆయనకి ఆయనే సాటి. ఇక రీసెంట్ గా బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పటం జరిగిందని తెలుస్తోంది. బాలకృష్ణ పూర్తి స్క్రిప్టు విని,డేట్స్ కేటాయిస్తానని చెప్పాడని అంటున్నారు. నిర్మాత ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. బెల్లంకొండ సురేష్ అయ్యే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే గతంలో రవికుమార్ తెలుగులో ఓ చిత్రం చేసారు. అదే నాగార్జునతో బావ నచ్చాడు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్ హీరోయిన్స్.
'సింహ' కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. జగపతిబాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ తొలిసారి బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ లెజెండ్ ఫస్ట్‌లుక్‌ను రీసెంట్ గా విడుదల చేసింది. దానికి మంచి క్రేజ్ వచ్చింది.