పద్మశ్రీ లేదా పద్మ భూషణ్... ఈ సారి బాలయ్యకు?
హైదరాబాద్: వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీరంగానికి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పటికే తెలుగు నుండి అనేక మంది ప్రముఖులు పద్మవిభూషన్, పద్మ భూషన్, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.
ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల లిస్టులో.....తెలుగు సినీ రంగం నుండి ప్రముఖ సీనియర్ సినీ నటుడు, గత కొన్నేళ్లు తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ చేస్తున్న నందమూరి బాలయ్య పేరు ఉండటం ఖాయమనే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలువురి ప్రముఖుల పేర్లతో సిఫారసు లిస్టులను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణకు పద్మశ్రీ లేదా పద్మభూషణ్ దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇక పద్మభూషణ్ కోసం మరో నటుడు మురళీమోహన్ పేరు వినిపిస్తున్నా పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉండటం వలన ఇవ్వడం సాధ్యంకాదని, ఎన్టీఆర్‌కు ఇపుడు భారతరత్న వీలుకాకుంటే, బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











