'శ్రీరామ రాజ్యం'కి బాలయ్య పైనే నెపం
శ్రీరామరాజ్యం చిత్రంలో రాముడు గా వేసిన బాలకృష్ణ తన తండ్రిలా మెప్పించాడంటూ వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో మరో టాక్ కూడా మొదలైంది. సినిమా బాగుందని రివ్యూలు,టాక్ వచ్చినా కలెక్షన్స్ లేవు. దానకి ప్రమోషన్ లో బాలకృష్ణ పాల్గొనక పోవటమే అంటున్నారు. సాధారణంగా హీరోలంతా సినిమా విడుదల అవ్వక ముందే హీరోయిన్నో,దర్శకుడ్నో తీసుకుని టీవీ చానెల్స్ చుట్టి వస్తూంటారు. బాలకృష్ణ మొదటి నుంచి ఆ పద్దతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సినిమాలో సత్తా ఉంటే ఆడుతుంది కానీ మనం బాగుంది అని మన సినిమా గురించి మనమే పబ్లిసిటీ చేసుకుంటూ తిరగటం అవసరమా అనే పాలసీని మెయింటైన్ చేస్తున్నారు. అయితే కాస్త దానిని ప్రక్కన పెట్టి శ్రీరామ రాజ్యం లాంటి సినిమా ని ప్రమోట్ చేస్తే బాగుండేది అంటున్నారు.
ఎందుకంటే యూత్ సాధారణంగా ఈ సినిమాకి రావటం లేదు. ఈ రోజు సినిమాకి వారే మహారాజ పోషకులు. అలాంటప్పుడు ఫ్యామిలీలు వస్తేనే ఈ సినిమా నిలబడుతుంది. వారు టీవిలకు అతుక్కుని పోయి ఉన్నారు. మరో నాలుగు రోజులు పోతే ఎలాగూ టీవీల్లో ఏ సినిమా అయినా వేసేస్తారులే అనే ఆలోచనా ధోరణికి అలవాట పడ్డవారు. దాంతో దాన్ని అధిగమించి మంచి సినిమాకి వారిని పట్టుకురావాలంటే బాలకృష్ణ,నయనతార వంటి వారికే సాధ్యం అంటున్నారు. వారు ఇద్దరూ పూనుకుని గ్రామీణ ప్రాంతాలకి వెళ్లితే సినిమా గ్యారెంటీగా నిలబడి మంచి విజయం సాధిస్తుంది..నిర్మాతల నమ్మకం వమ్ము కాదు అంటున్నారు. మరి ప్రస్తుతం బాలకృష్ణ వీటిన్నటికీ అతీతంగా తన తరువాత చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా లో చేస్తున్న గెస్ట్ రోల్ లో బిజీగా ఉన్నారు. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











