హాట్ న్యూస్:తేడా దర్శకుడుతో బాలకృష్ణ చిత్రం ఖరారు
' సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు...సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగు... అంటూ 'కొత్త బంగారులోకం' చిత్రంలో, 'ఇట్స్ నాట్ ఎ వాటర్ డ్రింకు స్లోలీ.. అంటూ 'అదుర్స్' చిత్రంలో తనదైన డైలాగ్ డెలివరీతో నటుడిగా ఆకట్టుకున్న చిన్నికృష్ణ 'వీడు తేడా' చిత్రంతో దర్శకుడిగా మారాడు. నిఖిల్ పూజా బోస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కళ్యాణ్ చక్రవర్తి, సందీప్ నిర్మించారు. ఆ మద్యన విడుదలైన ఈ చిత్రం దర్శకుడుగా మంచి పేరునే తెచ్చిపెట్టింది.
చిన్ని కృష్ణ మాట్లాడుతూ... సినిమా అంటే చిన్నతనం నుంచి వల్లమాలిన అభిమానం. ఆ అభిమానం వల్లే వైజాగ్‌లో స్టేజ్ నాటకాలకు కథలు అందించే వాణ్ణి. సినిమా అంటూ తీస్తే జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ తరహాలో ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలని వుండేది. అందుకే నిఖిల్‌తో ఫుల్‌పూంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'వీడు తేడా' చిత్రాన్ని రూపొందించాను. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
అలాగే నా జీవితంలో వినాయక్ గారి ప్రోత్సాహం మరువలేనిది. దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వ శాఖలో 'లక్ష్మీ' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన 'కృష్ణ, అదుర్స్' చిత్రాలకు పనిచేశాను. ఆ అనుభవంతోనే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకొని నా దగ్గర వున్న 'వీడు తేడా' కథను మొదట మా గురువు వినాయక్‌కు చెప్పాను. కథ విన్న తర్వాత ఆయన ఈ కథకు నిఖిల్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అన్నారు. అంతే కాకుండా కథలో కొన్ని మార్పులు కూడా చెప్పడం జరిగింది. ఆ చిత్రం విజయం సాధించింది అన్నారు.


Click it and Unblock the Notifications












