Balakrishna: ఇలా ఉన్నారేంట్రా బాబు.. బాలయ్య మూవీ రీరిలీజ్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
బాలయ్య మూవీ రిలీజ్ అంటే... బాలయ్య ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకుంటారు. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. అంతేనా.. జై బాలయ్య అంటూ నినాదాలు హోరెత్తిస్తారు. అంతలా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే తాజాగా బాలయ్య మూవీస్ రీరిలీజ్ చేయనున్నారట మేకర్స్. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గరం మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
బాలయ్య... ఈ పేరు వింటేనే ఎనర్జీ.. సిచ్యూవేషన్ తో సంబంధం లేకుండా నోటివెంట వచ్చే పదం జై బాలయ్య. అంతలా బాలయ్యకు ఫ్యాన్స్ అయిపోయారు ప్రేక్షకులు. అయితే బాలకృష్ణ ఈ మధ్య ఫుల్ జోష్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ ఏడాది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం అయితే కురిపించింది.

ప్రస్తుతం బాలకృష్ణ... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక బాలకృష్ణ కూతురి పాత్రలో టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.
ఇప్పటికే భగవంత్ కేసరి మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ తెచ్చి పెడుతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ డైలాగ్స్ వైరల్ గా మారాయి.

ఈ విషయం పక్కనపడితే బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ రీ రిలీజ్ సినిమాలపై ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ నటించిన ఎన్నో హిట్ మూవీస్ ఉండగా ఈ మూవీస్ రిలీజ్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే.
అయితే అందులో భాగంగానే బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలు రీ రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. టీవీల్లో వస్తేనే ఈ సినిమా చూడడానికి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటిది ఈ బోరింగ్ కాన్సెప్ట్ మూవీస్ థియేటర్లో మళ్లీ రిలీజ్ చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ నటించిన లెజెండ్, సింహా లాంటి సినిమాలు ఉండగా ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











