తనకు ఇష్టమైన నందమూరి హీరోకు మరోసారి లైఫ్ ఇస్తున్న బాలయ్య.. బోయపాటి సినిమాలో..
నందమూరి బాలకృష్ణకు నచ్చితే అంత ఈజీగా వదులుకోరని ఇండస్ట్రీలో చాలా మంది చెప్పేమాట. ఇక నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో అయినా, దగ్గరి బంధువైనా ఆయన లెక్క చేయరనే టాక్ కూడా వస్తుంటుంది. ఇక చాలా కాలం తరువాత ఒక నందమూరి హీరోకు బాలకృష్ణ మంచి కెరీర్ ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో చేత కెరీర్ మొదట్లో బాలయ్య వరుసగా సినిమాలను ఓకే చేయించారు.
Recommended Video

నమ్మకంతో ఉన్న బాలకృష్ణ
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన కొన్ని పాత్రలు సినిమాకే హైలెట్ అవుతాయట. ఇక ముఖ్యమైన ఒక పొలిటికల్ లీడర్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

బాలయ్యకు ఇష్టమైన నందమూరి హీరో
అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాలకృష్ణ పట్టుబట్టి ఆ పాత్ర కోసం నందమూరి నటుడిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. తారకరత్న. ఈ హీరో అంటే బాలయ్యకు చాలా ఇష్టమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తారకరత్న హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కారణం కూడా బాలయ్యనే ముఖ్య కారణం. కానీ అతను ఎక్కువరోజులు సందడి చేయలేకపోయాడు.

ఆ సినిమాతోనే తారకరత్న టాలెంట్ బయటపడింది
2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమైన తారకరత్నకు షూటింగ్ సమయంలోనే నాలుగు ఆఫర్స్ వచ్చేలా బాలయ్య సపోర్ట్ చేశారని అప్పట్లో ఒక టాక్ వచ్చింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా తారకరత్న ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. అతనిలో మంచి నటుడు ఉన్నాడు కానీ సరైన పద్దతిలో ఉపయోగించుకోవడం లేదని అమరావతితో అర్ధమయ్యింది.

పవర్ఫుల్ పొలిటీషియన్ గా తారకరత్న
అప్పుడప్పుడు సపోర్టింగ్ పాత్రలతో ఆకట్టుకున్న తారకరత్నకు తన సినిమాలో కూడా మంచి పాత్ర వచ్చినప్పుడు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా బోయపాటితో చేస్తున్న సినిమాలో పవర్ఫుల్ పొలిటికల్ క్యారెక్టర్ తారకరత్న కెరీర్ కి ఉపయోగపదుతుందని ఇటీవల డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో చర్చించినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బాలయ్య మాత్రం తారకరత్నకు మరో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











