పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో బాలయ్య రొమాన్స్...
పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించిన అమీషా పటేల్ గుర్తుందా. ఆమె తాజాగా బాలకృష్ణ సరసన బుక్కయిందని సమాచారం. సెప్టెంబర్ ఒకటవ తేదీనుంచి ప్రారంభం కానున్న పరుచూరి మురళి చిత్రం కోసం ఆమెను బుక్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హైదరాబాద్ లో ఆగస్టు 27న అఫీషియల్ గా లాంచ్ కానుంది. ఇక అమీషా పటేల్..బద్రి చిత్రం తర్వాత మహేష్ బాబు సరసన నాని, ఎన్టీఆర్ సరసన నరసింహ చిత్రంలో చేసింది. అయితే ఆ తర్వాత ఆమె లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో కనపడుతోంది. ఎమ్.ఎల్.కుమార్ చౌదరి..తమ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించే ఈ చిత్రం ఓ పవర్ ఫుల్ కథతో వస్తోందని వినికిడి. విజయ్.సి.కుమార్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చనున్నారు. ఇక పరుచూరి మురళి గతంలో పెదబాబు, ఆంధ్రుడు, రెచ్చిపో చిత్రాలు డైరక్ట్ చేసారు.
బాలకృష్ణ సింహా కళ్యాణ్ మాలిక్ పెదబాబు పరుచూరి మురళి అమీషా పటేల్ balakrishna simha kalyan malik andrudu paruchuri murali


Click it and Unblock the Notifications