హరహరా ఆ విగ్గేంటి..ఆ డ్రెస్సేంటి...బాలయ్యా..!?
బాలకృష్ణ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన హర హర మహాదేవ సినిమా ప్రారంభోత్సవంలో బాలయ్య పోస్టర్ లను చూసి అభిమానులు ఖంగు తిన్నారు. కొన్ని పోస్టర్లు చూస్తే దశావతారం లో కమల హసన్ వేసిన గెటప్ లకు బాలకృష్ణ ముఖం అంటిన్చినట్లు ఉంది. దీంతో సినిమా ఓపెనింగ్ రోజే పాత పోస్టర్స్ పెట్టారెంటని ఖంగుతిన్నారు. అన్ని పోస్టర్ లు పరీశిలిస్తే వేరే హీరోల సినిమాల పోస్టర్ లాగే ఉన్నాయి తప్ప బాలయ్య కొత్త సినిమా పోస్టర్స్ లా లేవని అభిమానులు చర్చించుకున్నారు.
అంతే కాదు హరహర మహాదేవ షూటింగ్ కి బాలకృష్ణ విచ్చేశాడనే ఆనందం కంటే, ఆయన పుట్టిన రోజు వేడుకలు తమ సమక్షంలో జరుగుతున్నాయనే సంబరం కంటే..బాలయ్య అభిమానుల్ని ఆయన వేసుకొచ్చిన డ్రస్సు, పెట్టుకొచ్చిన విగ్గు ఎక్కువ ఇబ్బంది పెట్టాయి. ఇప్పటికే విగ్గుల విషయంలో పలుమార్లు కామెడీకి గురయిన బాలకృష్ణ ఈసారి మరింత విచిత్రమైన విగ్గుతో వచ్చారు. ఇది హరహర మహేదేవ కోసం పెట్టుకున్న ఎక్స్ క్లూజివ్ విగ్గో లేక వేరే సినిమా షూటింగు నుంచి రావడం వల్ల అదే విగ్గుతో వచ్చేశారో తెలీదు ఇక ఆయన దరించిన పింక్ బ్లేజర్, టోర్న్ జీన్స్ అయితే బాలకృష్ణ స్టయిలింగ్ చేసే వ్యక్తి మీద ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. సాధారణ దుస్తులు వేసుకుని వచ్చినప్పుడు హుందాగా కనిపించే బాలయ్య షూటింగ్ అనేసరికి ఎందుకింత కామెడీ వేషం కడతారో అర్థం కాదని సినీ జనాలు అంటున్నారు.


Click it and Unblock the Notifications











