Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ టాపిక్ : బాలకృష్ణ,బోయపాటి చిత్రంలో పిజ్జా పంచ్...
విలన్ : పాలిటిక్స్ అంటే పిజ్జాలు తినటం అనుకుంటున్నావా? జనం ఏమి చూసి నీకు వోట్ వేస్తారనుకుంటున్నావ్ జయసింహా ?
బాలకృష్ణ: పాలిటిక్స్ గురించి నాకేం తెలుసా....రాజకీయం నా బ్లడ్ లో ఉందిరా.. చరిత్ర సృష్టించిన వంశం నాదిరా...నేను ఎలక్షన్ లో నిలబడితే నిన్ను అడ్డంగా తొక్కి అయినా నన్ను జనం నిలబడతారు .
విలన్ : అచ్చా....అంత అతి అనర్దానికి దారి తీస్తుంది జయసింహా .
బాలయ్య: ఆ సామెతలు,సూక్తలు నీకు వర్తిస్తాయి రా...నేనీ బరిలోకి దిగాక నీ గతి తప్పేలా చేస్తా...
ఈ పై డైలాగు సినిమాలో ఉంటుందో లేక బాలకృష్ణ ఫ్యాన్స్ క్రియేట్ చేసారో కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఓ రేంజిలో ప్రచారం పొందుతోంది.
దర్శకుడు బోయపాటి శ్రీను సారథ్యంలో రాజకీయ ప్రాధాన్యం కలిగిన చిత్రంలో తాను నటిస్తున్నానని, ఎన్నికల నాటికి ఇది విడుదల చేస్తామని, నేటి రాజకీయాల్లో అవినీతి, అవకతవకలను ఈ చిత్రంలో చూపిస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.