యూట్యూబ్ లో పాపులరైన బాలయ్య...
'సింహా"గా హిట్టు కొట్టినా ఇంకా బాలయ్య జోకుల ప్రవాహం ఆగట్లేదు. ఎస్ ఎం ఎస్ లతో యూట్యూబ్ వీడియోల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో బాలకృష్ణ భారీ సెటైర్లు సంధిస్తూ ఎవరికివారు తమ క్రియేటివిటీని చూపించేసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ ఔత్సాహికుడు రూపొందించిన బాలయ్య వొడా ఫోన్ యాడ్ అయితే విశేషమైన రీతిలో వీక్షకాదరణ పొందుతోంది. బ్యూటీ టిప్ప్ అందిస్తానంటూ వొడా ఫోన్ క్రియేట్ చేసిన ఓ జూజూ యాడ్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ గదిలోకి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి కెవ్వుకెవ్వున కేకలు పెడుతూ బయటికి వచ్చేస్తూవుంటారు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పేస్ ప్యాక్ వేసుక్కూర్చున్న శాల్తీ ఒకటుంటుంది. దాన్ని కాస్త మార్చి వీళ్ళంత కెవ్వు కెవ్వున కేకలు పెట్టి భయపడింది లోపల టీవీలో బాలకృష్ణ సినిమా ప్రసారమవుతూ వుండడం వలన అని చూపిస్తూ 'బాలయ్య" ఎలర్ట్స్..ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ వొడా" అనే స్లోగన్ ని యాడ్ చేసి భలే తెలివిగా మిక్స్ చేసిన ఈ వీడియో వెబ్ లో వెరీ పాపులర్ అయిపోయిందిప్పుడు.


Click it and Unblock the Notifications











