బాలకృష్ణ డైలాగులతో అలజడులు!
'సింహా"కలెక్షన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంటే.'సింహా"డైలాగ్స్ డైనమైట్స్ లా పేలుతున్నాయి రాష్ట్రమంతటా..! 'నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి', 'చరిత్ర సృష్టించాలన్నా మేమే..ఆ చరిత్రని తిరగరాయాలన్నా మేమే", 'అరక్షణంలో పోయేవాడివి..నీ అడ్రస్ నాకెందుకురా", 'చూడూ..ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు" ఇలా 'సింహ'గా నందమూరి బాలకృష్ణ పలికిన డైలాగ్స్ అన్నీ విపరీతంగా పాపులర్ అవుతుంటే 'బురద జాతి" అనే ఒక పదం మాత్రం ఏకంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
'సింహా" సెకండాఫ్ లో పోలీస్ కమీషనర్ దగ్గర తన ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ 'వాళ్ళెంత..బురదజాతి" అంటాడు బాలయ్య. అయితే హీరోలు సినిమాల్లో చెప్పే డైలాగ్స్ ని బయట తమకు అనుగుణంగా అన్వయించేసుకోవడం అభిమానులకు ఎప్పటినుంచో వున్న అలవాటే. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు తమ అప్పోజిషన్ ఫ్యాన్స్ తో వాదనలు మొదలవగానే ఈ 'బురద జాతి" అనే మాటను ఆయుధంగా వాడేసుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్ అందరూ. కుల, మత, జాతుల ప్రస్తావన ఎందుకని నందమూరి ఫ్యాన్స్ ని వారిస్తుంటే ఇన్నాళ్ళ పరాజయాలకూ, మేము పొందిన అవమానాలకు ఇది బదులని అంటున్నారట. 'సింహా" ఊపు కాస్త తగ్గాక ఈ అభిమానుల వేడి కూడా చల్లారిపోవచ్చు కానీ 'బురద జాతి" అనే చిన్న పదం రేపిన ఈ పెద్ద అలజడిని మాత్రం ఇప్పట్లో మర్చిపోలేం.


Click it and Unblock the Notifications











