బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్, టైటిల్ ఏంటంటే

By Srikanya

బాలకృష్ణ,రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్నట్లు ఫిల్మ్ నగర్ లో గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య వందవ చిత్రం డైరక్ట్ చేయటానికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రెండు దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని శ్రీరామ రాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. బారీగా రూపొందే ఈ చిత్రం రాజకీయాలు ప్రాధాన్యంగా సాగుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ అనే టైటిల్ ని పెట్టనున్నట్లు చెప్తున్నారు. ట్యాగ్ లైన్ గా.. న్యాయానికి త్యాగానికి రారాజు అని ఉంటుంది. ఇప్పటికే ఈ టైటిల్ ని బాలకృష్ణ సొంత నిర్మాణ సంస్ధ రామ కృష్ణ స్టూడియోస్ పతాకంపై ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. వందవ చిత్రాన్ని తన తండ్రిగారైన ఎన్టీఆర్ కి అంకితమిస్తూ చరిత్రలో గుర్తుండిపోయాలా తీర్చి దిద్దాలని బాలకృష్ణ యోచిస్తున్నారు. అలాగే ఆ చిత్రంతో తన రాజకీయ ప్రచారాన్ని ని సైతం ముడిపెట్టనున్నారని భోగట్టా.

ప్రస్తుతం బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ'చిత్రంలో చేస్తున్నారు. ''సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై ఓ జర్నలిస్ట్ గావించిన పోరాటమే ఇతివృత్తంగా తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీమన్నారాయణ' అని చెప్తున్నారు. ఇందులో బాలకృష్ణ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. ఆయన నటన ఈ సినిమాలో కొత్త పుంతలు తొక్కుతుంది. నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఇది'' అని దర్శకుడు రవికుమార్ చావలి అంటున్నారు.

పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా ఇందులో కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రమేష్ పుప్పాల చెబుతున్నారు. ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక మరోప్రక్క బాలకృష్ణ గెస్ట్ పాత్రలో నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా ఈ నెలలోనే అంటే జూలై 27న విడుదలకు సిద్దమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X