»   » బాలకృష్ణే స్వయంగా హీరోయిన్ ని రికమెండ్ చేసాక ఏం చేస్తాం?

బాలకృష్ణే స్వయంగా హీరోయిన్ ని రికమెండ్ చేసాక ఏం చేస్తాం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాంచనమాల కేబుల్ టీవి(శ్రీకాంత్)చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన లక్ష్మీ రాయ్..తాజాగా బాలకృష్ణ సరసన చేయటానికి కమిటైన సంగతి తెలిసిందే. అయితే ఆమెను తీసుకోవటం దర్శక,నిర్మాతలెవరకీ ఆసక్తిలేదట. అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి ఒప్పించాడని తెలుస్తోంది. దాంతో పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ పాత్ర హైలెట్ అవుతుందంటున్నారు.ఇక బాలకృష్ణే స్వయంగా ఆమెను నిర్మాత ఎమ్.ఎల్.కుమార్ చౌదరికి రికమెండ్ చేయడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఆమెనుతీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే లారెన్స్ ఆమెను బాలయ్యకు పరిచయం చేసాడని, ఆమె ఫ్రొఫైల విన్న బాలకృష్ణ వెంటనే స్పందించటం ఎగ్రిమెంట్ అయిపోవటం అంతా క్షణాల్లో జరిగిపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె తెలుగులో చేసిన ఏ చిత్రమూ ఆడకపోవటం సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. అయితే హీరోనే స్వయంగా చెప్పటం ఆమెకు కలసివచ్చిన అంశం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu