రామ్ సినిమాలో బాలకృష్ణ.. ఫాన్స్ కి మరో ట్రీట్ సిద్ధం చేస్తున్న బోయపాటి
ప్రస్తుతానికి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా ఆయన ఒక పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ను ఆకట్టుకుంటుంది. మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆ సంగతలా ఉంచితే రామ్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్న సినిమా విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆగస్టు నెలలో
అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తరువాతి సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. రామ్ నటిస్తున్న ది వారియర్ సినిమాని నిర్మిస్తున్న శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణ రిఫరెన్స్
ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళకుండానే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ఆయన నటిస్తున్నాడని కాదు. ఈ సినిమాలో రామ్ బాలకృష్ణ అభిమాని గా కనిపిస్తాడని ఒక సీన్ మొత్తం బాలకృష్ణ రిఫరెన్స్ తో నిండి పోతుంది అని తెలుస్తోంది.

చూసి ఆనందించే విధంగా
ఎలా అయితే కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాలో నాని బాలకృష్ణ అభిమాని గా అలరించాదో అదేవిధంగా ఇప్పుడు రామ్ కూడా బాలకృష్ణ అభిమానులను తనదైన డైలాగులతో అలరించే ప్రయత్నం చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే కృష్ణ గాడి వీర ప్రేమ కథ విషయంలో కాస్త లైట్ గానే ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను స్వయానా నందమూరి బాలకృష్ణ అభిమాని కావడంతో ఈ సన్నివేశాన్ని ఫ్యాన్స్ అందరూ కూడా చూసి ఆనందించే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అందరినీ సినిమాకి రప్పించాలనే
రామ్ కి ఉన్న మార్కెట్ కి మించి ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టాలి అంటే ఇలాంటి ఒక ఐడియా ఏదో వర్క్ అవుట్ చేయాలని భావించిన బోయపాటి శ్రీను వేరే ఏదో ఎందుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు అందరినీ సినిమాకి రప్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది.

రంగం సిద్ధం
ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఈ సినిమా ఆఖర్లో హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు లైన్ లో పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆయన తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో సినిమా చేయబోతున్నారు. అలాగే సింగీతం శ్రీనివాసరావు తో కలిసి మరో సినిమా చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











