Balakrishna: ఆ కథను బాలయ్య రిజెక్ట్ చేయడమే రామ్ చరణ్ పంట పండింది
బాలయ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అన్నా.. ఆయన అన్నా.. అభిమానించే ఎంతో మంది ఉన్నారు. అయితే ఆయన ఓ కథను రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ పంట పండిందని తెలుస్తోంది. బాలయ్య హీరోగా చేయాల్సిన ఓ కథను రామ్ చరణ్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆ సినిమా ఏంటి.. ఎందుకు రిజెక్ట్ చేశారు.. చరణ్ కు ఎలా ఆ ప్రాజెక్టు దక్కిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి నటసింహ బాలకృష్ణ.. ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. అఖండ సినిమా నుంచి ఆయన జాతకమే మారిపోయిందని చెప్పాలి. ఏది పట్టుకున్నా హిట్టే అన్న చందంగా.. ఆయన కెరియర్ నడుస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా పూర్తి చేసే పనిలో బిజి బిజిగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే గతంలో జరిగిన ఓ విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. బాలయ్య ఓ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో మొదట హీరోగా బాలయ్యను అనుకున్నారట. ఆయనకు మగధీర కథను చెప్పగా.. రిజెక్ట్ చేశారట. దానికి కారణం ఆ సినిమాలో యంగ్ హీరో నటిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. అయితే ఆ సినిమాను అప్పట్లో రిజెక్ట్ చేసినట్లు న్యూస్ వైరల్ గా మారింది.
బాలయ్య ఆ కథను రిజెక్ట్ చేయడంతో.. అప్పుడే చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రామ్ చరణ్. ఈ కథ రామ్ చరణ్ కు బాగుంటుందని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. అలా బాలయ్య కోసం అనుకున్న కథను రామ్ చరణ్ చేశారు. బాలయ్య రిజెక్ట్ చేయడంతోనే రామ్ చరణ్ పంట పండిందని నెటిజన్స్ అంటున్నారు. ఈ న్యూస్ ను బాలయ్య ఫ్యాన్స్ వైరల్ గా మార్చుతున్నారు.

ఇక రామ్ చరణ్ రెండో సినిమాగా మగధీర వచ్చింది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. రామ్ చరణ్ యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. ఇక రాజమౌళి దర్శకత్వం, ఎంఎం కీరవాణి సంగీతం.. ఈ సినిమాను వెరే లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది.

అలా బాలయ్య చేయాల్సిన మూవీ చరణ్ చేసి.. ఇండస్ట్రీ కొట్టాడు. ఇక బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజిగా ఉన్నాడు. అటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాబీ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమా చేస్తాడా ఎలక్షన్స్ తర్వాత చేస్తారా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











