చిరు తప్పే బాలయ్య రిపీట్?

By Staff

జోష్ ఆడియో పంక్షన్ లో బాలకృష్ణ బబల్ గమ్ ని నములతూ అందరికీ కన్పించారు. ఇది చూసినవారందరికీ మగధీర ఆడియో పంక్షన్ లో చిరంజీవి బబుల్ గమ్ నములుతూ దర్శనమివ్వటం టక్కున గుర్తుకు వచ్చింది. సాధారణంగా స్టేజి ఫియర్ ని గానీ, గిల్టీనెస్ ని గానీ అధిగమించటానికి ఈ బబల్ గమ్ నమిలే పద్దతిని అనుసరించమని సైకాలిజిస్టులు సలహాలిస్తూంటారు. దాంతో ఈ సూత్రం తెలిసిన కొందరు మగధీర ఆడియో మర్నాడు ఈ పాయింటు పై చర్చ లేవదీసాడు. ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో ఓ రకమైన గిల్టీ ఫీలింగ్ లో ఆయన ఉన్నారని, తనతోటి సినిమావాళ్ళ మధ్యన అది బయిటపడకుండా కవర్ చేసే ప్రయత్నం చేసారని కామెంట్స్ చేసారు.

అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత చిరంజీవి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ అసెంబ్లీకీ సైతం వెళ్ళొచ్చారు..అప్పుడు లేని గిల్టీ ఫీలింగ్ ఇప్పుడు ఎక్కడనుంచి వచ్చిందని కొందరు దాన్ని కొట్టిపడేసారు. అయితే బాలయ్య కూడా జోష్ పంక్షన్ లో బబల్ గమ్ నములుతూ రెక్లస్ గా ఉన్నట్లు కనపడటంతో ఆయన కూడా ఇలాంటి విమర్శనే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం తరుపున ఆయన చేసిన ప్రచారం పెద్దగా ఫలించకపోవటంతో ఆ విషయం తన సినిమావాళ్లు కనపడినప్పుడు ఇబ్బందిగా అన్పిస్తుందని, ఆ సమస్యని అధిగమించటానికే బబుల్ గమ్ నమిలాడని అన్నారు. అందులోనూ అసలు బాలయ్య స్పీచులలో క్లారిటీ మిస్సవుతుందని, ఎక్కడో మొదలుపెట్టి మరెక్కడో వెళ్తూంటాడని ఎప్పటినుంచో టాక్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బాలయ్య పెద్దగా పంక్షన్స్ కి అటెండవటానికి ఇష్టపడడని, అయితే తప్పనిసరి పరిస్దితుల్లో వచ్చినా ఇటువంటి విమర్శలు వస్తున్నాయని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X