టాక్ ఆఫ్ ది టౌన్: బోయపాటి సినిమాలో బాలయ్య రోల్ లీక్.. మరీ అంత భయంకరంగా ఉంటాడా.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే. ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడాయన. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లోని హీరోల్లో బాలయ్య పేరు మీద ఉన్నన్ని సంఘాలు మరో హీరోకు లేవన్న టాక్ ఉంది. అందుకే ఫ్యాన్స్ కోసం ఈ సీనియర్ హీరో పని చేస్తుంటాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

బాలయ్యకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు
గత సంవత్సరం నందమూరి బాలకృష్ణకు అస్సలు కలిసి రాలేదు. 2019లో ఆయన నటించిన ‘యన్.టి.ఆర్' రెండు భాగాలతో పాటు ‘రూలర్' విడుదల అయ్యాయి. ఈ మూడు చిత్రాలు భారీ అంచనాలతో రూపొందినప్పటికీ.. తీవ్రంగా నిరాశ పరిచాయి. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైన సక్సెస్‌ఫుల్ జోడీ
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి. ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్ల తర్వాత చేస్తున్న మూవీ కావడంతో దీనిపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే ఈ కాంబోలో హ్యాట్రిక్ నమోదవుతుంది.

షూటింగ్ మొదలవకముందే స్టార్ అయ్యాయి
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో బోయపాటి - బాలయ్య మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులతో పాటు కథ, బాలయ్య రోల్ సహా ఎన్నో అంశాలపై ఊహాగానాలు మొదలైపోయాయి. షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సినిమా ఆగింది.. బాలయ్య మాత్రం అలా..!
ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ జనవరి మొదటి వారంలోనే ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ, అది ఆలస్యం అవడంతో సినిమా ఆగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించడం ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బాలయ్య కనిపిస్తున్నదే బోయపాటి సినిమాలో గెటప్ అని అంటున్నారు.
Recommended Video

బోయపాటి సినిమాలో బాలయ్య రోల్ లీక్
తాజాగా ఈ సినిమాలో బాలయ్య రోల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఓ పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నాడని ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను వారణాసి సమీపంలోని అడవుల్లో షూట్ చేయబోతున్నారట. ఈ పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











