బాలకృష్ణ 100 వ చిత్రం దర్శకుడు,నిర్మాత ఖరారు
హైదరాబాద్ : లెజండ్ హిట్ తో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తన వందో చిత్రానికి సంభందించిన దర్శక,నిర్మాతలను ఖరారు చేసాడని వినికిడి. సింహా తర్వాత వరస ఫ్లాపులతో ఉన్న బాలయ్య ..వందో చిత్రం పై డైలమాలో ఉన్నారు. అయితే లెజండ్ హిట్ తో బోయపాటి శ్రీను కే వందో చిత్రం దర్శకత్వం అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అలాగే నిర్మాతగా 14 రీల్స్ వారికే ఆ భారీ ప్రాజెక్టుని అప్పగించాలని ఆయన వారితో మాట్లాడారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ తో ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ మరో రెండు చిత్రాలు పూర్తి చేస్తారు.
పలువురు దర్శకులు బాలయ్యతో సినిమాలు రూపొందించినప్పటికీ బాలకృష్ణ అభిమానులు ఆశించినంత హిట్ ను ఇవ్వలేక పోయారు. వైవియస్ చౌదరి లాంటి నందమూరి కుటుంబ అభిమానులు తీసిన సినిమాలు కూడా బాలయ్య అభిమానులను రంజింప చేయలేక పోయాయి. అయితే కొంత కాలం విజయాలకు దూరంగా ఉన్న సమయంలో బోయపాటి "సింహా' సినిమాతో బాలయ్య అభిమానులకు పలావు పెట్టాడు. అంతటితో ఆగకుండా "లెజెండ్'' చిత్రంతో విందుభోజనం పెట్టాడు.

దాంతో బాలయ్య అభిమానులు బోయపాటిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతే కాదు మెగా ఫ్యామిలీ కథానాయకులు కూడా బోయపాటి తో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గతంలో బాలయ్యతో బ్లాక్ బస్లర్స్ తీసిన దర్శకులు కోడి, బి.గోపాల్ ల తరహాలోనే బోయపాటి కూడా బాలయ్య సినిమా కెరియర్ లో రికార్డులు సృష్టించిన దర్శకుడిగా మిగిలి పోవడం ఖాయమని బాలయ్య అభిమానులు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











