బాలకృష్ణ'అధినాయకుడు'సెన్సార్ రిపోర్టు
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని ఎ సర్టిపికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ టాక్ బాగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. సినిమా ప్రారంభమైన నాటి నుంచి నెగిటివ్ టాక్ ను మూట గట్టుకున్న ఈ చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. మొత్తానికి ఈ చిత్రాన్ని ఏప్రియల్ 12 న విడుదల చేయటానికి తేదిని ఫిక్స్ చేసారు. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా 'అధినాయకుడు' రాబోతోంది.
అప్పటికే చాలా సార్లు విడుదల వాయిదా పడటంతో ఈ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే సెన్సార్ టాక్ విన్నవారు మరో సమరసింహా రెడ్డి లాంటి సినిమా అని ఫిక్స్ అయ్యి ముందుకు వస్తున్నట్లు సమాచారం. సెకండాఫ్ లో వచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మంచి టాక్ మొదలైంది. బాలకృష్ణ చేసిన మూడు పాత్రలు అదరకొట్టాడని,ముఖ్యంగా తాత పాత్రలో జీవించాడని అంటున్నారు. నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుందని,సింహా రికార్డులు బ్రద్దలు కొడుతుందని చెప్పుకుంటున్నారు.
దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











