హైదరాబాద్‌లోని బాలయ్య ఇల్లు కూల్చబోతున్నారా?
బాలకృష్ణ అభిమానులు ఎవరైనా తొలిసారి హైదరాబాద్ వస్తే తప్పకుండా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటిని చూడకుండా వెళ్లరు. అక్కడి వరకు వెళ్లి ఇదేనా మా బాలయ్య ఇల్లు అని బయటి నుండే చూసి ఆనందపడిపోతారు. ఇపుడు బాలకృష్ణ ఇంటికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

బాలయ్య ఇల్లు షాపింగ్ మాల్‌గా?
హైదరాబాద్‌లో బాలయ్య ఇల్లు త్వరలో షాపింగ్ మాల్‌గా మారబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం తన ఇంటిని డెవలప్‌మెంట్ పద్దతిన ఓ సంస్థకు ఇస్తున్నారని, ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తయిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇంటిని కూల్చబోతున్నారా?
బాలయ్య ఇంటిని దక్కించుకున్న సదరు కంపెనీ బాలకృష్ణ ఇంటిని కూల్చివేసి ఆ స్థానంలో పెద్ద షాపింగ్ కాంప్లోక్స్ కట్టబోతోందట. అయితే ఇందులో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.

బాలయ్యకు ఈ ఇల్లు సెంటిమెంట్
బాలయ్యకు తొలి నుండి ఈ ఇల్లు సెంటిమెంట్. ఇక్కడికి వచ్చాకే ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ వచ్చింది..... మరి అలాంటి ఇంటిని బాలయ్య నిజంగానే వేరే సంస్థకు అప్పగించి కూల్చివేయడానికి సిద్ద పడ్డారా? అని ఈ వార్తలు విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందంటూ...
బాలకృష్ణ ఇల్లు ఉన్న లైన్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కవు. గతంలో బాలయ్య ఇంటి స్థలాన్ని రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరుగలేదు.

మాల్ నిర్మించేది ఇక్కడా? వేరే చోటా?
బాలయ్యకు హైదారబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. బాలయ్య ఇంటి స్థలంలో మాల్ అనే వార్త జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఇంటి విషయంలోనేనా? లేక బాలయ్యకు చెందిన ఇతర స్థలంలో నిర్మిస్తుంటే పొరపాటున జూబ్లీహిల్స్ ఇల్లు అని పొరపాటు పడ్డారా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











