»   » బాలయ్య 'లెజండ్' ఫస్ట్ లుక్ ఎప్పుడు?

బాలయ్య 'లెజండ్' ఫస్ట్ లుక్ ఎప్పుడు?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Balakrishna
  హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . ఎన్నో అంచనాలతో రెడీ అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని న్యూ ఇయిర్ అంటే జనవరి 1 వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు ఫస్ట్ లుక్ ని అదిరిపోయే రీతిలో రెడీ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.


  మరో ప్రక్క ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఫిబ్రవరిలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని సమాచారం. దాంతో పిభ్రవరిలో విడుదల అయ్యే అవకాసం లేదు. చిత్రం షెడ్యూల్ వివరాలకి వస్తే... నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు అయ్యింది. జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

  బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

  జనవరిలో బాలకృష్ణ, చిత్ర హీరోయిన్స్ తో పాటు ఓ గెస్ట్ హీరోయిన్ పై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

  పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.


  ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

  English summary
  Natasimha Balakrishna is planning to make his upcoming entertainer ‘Legend’ a perfect launch pad for his powerful political show. According to the latest filmmakers are planning to give New Year treat to Nandamuri fans by releasing Balakrishna's first look in ‘Legend’ on 1st, Jan 2014.Devi Sri Prasad is scoring music for the film produced on 14 Reels Entertainment banner by Gopi Achanta,Ram Achanta,Anil Sunkara, Sai Korapati.Film stars Jagapathi Babu in important role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more