బాలకృష్ణ 'లెజెండ్' పాటలు లీకయ్యాయా?
హైదరాబాద్: తెలుగు సినిమాను పైరసీ రక్కసి పట్టి పీడిస్తోంది. విడుదలకు ముందే లీక్ కావడం కూడా తెలుగు సినిమాకు రోగంలా పట్టింది. నాయక్, ఎవడు వంటి సినిమాలు వీడియోలు లీకైన విషయం అందరికీ తెలిసిందే. ఆడియో విడుదలకు ముందే పలు సినిమాల పాటలు బయటకు రావడం కూడా చూస్తూనే ఉన్నాం.
పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా పైరసీ భూతానికి బలైంది. సినిమా తొలి అర్థ భాగం విడుదలకు ముందే బయటకు వచ్చి వివాదానికి కారణమైంది. తాజాగా, నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్‌కు లీక్ పీడ తప్పలేదని అంటున్నారు. లెజెండ్ సినిమాలోని ఓ పాట అంటూ లీకై ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది.
లెజెండ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. దీన్ని ఎవరో లీక్ చేసి నెట్‌లో పెట్టారు. అది ఇంటర్నెట్లో రౌండ్లు కొడుతోంది. లీకేజీ సమస్య మంచిది కాదు. కానీ లెజెండ్ సినిమాలోని పాట అందరినీ ఆకర్షిస్తోంది.
లీకైన పాట విన్న శ్రోతల్లో సినిమా ఆసక్తి పెరుగుతోంది. అధికారికంగా ఆడియో విడుదలైతే తప్ప ఆ పాట లెజెండ్ సినిమాలోనిదేనా కాదా అనేది తేలుతుంది. లెజెండ్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications
