బాలయ్య జై సింహ బిజినెస్‌కు తప్పని కష్టాలు.. డిస్టిబ్యూటర్లకు పైసా వసూల్ భయం
పైసా వసూల్ చిత్రం తర్వాత సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో జై సింహతో ముందుకు వస్తున్నాడు.
నటసింహం నందమూరి బాలకృష్ణ వందో చిత్రం తర్వాత సినిమా వేగం పెంచారు. పూరీ దర్శకత్వంలో తన 101 సినిమా పైసా వసూల్‌ను శరవేగంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో జై సింహతో ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ గురించి సినీ వర్గాల్లో నిరాధారంగా జరుగుతున్న చర్చ చాలా ఆసక్తికరంగా మారింది.
Recommended Video


పైసా వసూల్ బిజినెస్
గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత పైసా వసూల్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పైసా వసూల్ చిత్రానికి దాదాపు రూ.33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తొలి ఆట నుంచే డివైడ్ టాక్
పైసా వసూల్ చిత్రానికి రిలీజైన తొలి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ కలెక్షన్లను కొల్లగొడుతుంది అని అందరూ భావించారు.

డిస్టిబ్యూటర్లకు భారీ నష్టం
తొలివారాంతం తర్వాత పైసా వసూల్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తంగా ఈ చిత్రం దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. అంటే దాదాపు 13 కోట్ల నష్టాన్ని డిస్టిబ్యూటర్లకు పంచినట్టు ట్రేడ్ అనలిస్టుల పేర్కొన్నారు.

జై సింహ సినిమాపై
ఈ చిత్ర కలెక్షన్ల వ్యవహారం ప్రస్తుతం రానున్న జై సింహ చిత్రంపై భారీగానే చూపుతుందట. డిస్టిబ్యూటర్లు ముందు వెనుకా ఆలోచిస్తున్నారట. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం ఏ విధంగా ప్రీ రిలీజ్ చేస్తుందో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











