రజనీకాంత్ 'రోబో' చిత్రంపై బాలకృష్ణ సెటైర్స్
బాలకృష్ణ సింహా చిత్రం కలెక్షన్స్ ని "రోబో" అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందతున్న పరమవీరచక్ర చిత్రం రోబో చిత్రంపై సెటైర్స్ విసురుతున్నారని తెలుస్తోంది. ఈ పేరడి కామిడిని కావాలనే దాసరి పూర్తి స్ధాయి సెటైర్స్ తో రాసి వదులుతున్నారని చెప్తున్నారు. బ్రహ్మానందంపై ఈ పేరడీ ని క్రియేట్ చేస్తున్నారు. అలీ రోబో గానూ, సైంటిస్ట్ గా బ్రహ్మానందంను చేయనున్నారు. అలాగే బాలకృష్ణ చేత కూడా ఈ రోబో పై డైలాగులు దాసరి వేయిస్తున్నారు. ఇక సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినీ హీరోగానూ, ఆర్మీ మేజర్ గానూ దేశభక్తి పూరిత పాత్రలో కనిపించనున్నారు. ఇక బాలకృష్ణ సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూఫియాల ముగ్గరూ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
రోబో బాలకృష్ణ పరమవీర చక్ర షీలా అమీషా పటేల్ నేహా ధూపియా robo balakrishna paramaveera chakra sheela amisha patel dasari narayana rao


Click it and Unblock the Notifications