విగ్ కి ఇక గుడ్ బై అంటున్న బాలకృష్ణ

By Srikanya

హైదరాబాద్ : అభిమానులకు ఆనందం కలిగించే నిర్ణయం బాలకృష్ణ తీసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో వరసగా ఆయన చేసిన సినిమాల పరాజయంలో కీలకపాత్ర పోషించింది విగ్ అని ఆయన అబిమానుల అభియోగం. దానికి చెక్ చెప్పటానికి బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారని స్వయంగా తనను కలిసిన వారితో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటారని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని మరో వర్గం అంటోంది. త్వరలో రాజకీయంగానూ బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వటానికి సిద్దపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయం నిజమైతే అందరూ ఆనందించే విషయమే.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ .. 'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ పచ్చజెండా ఊపలేదు. రకరకాల వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకూ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారట. క్రేజీ రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందిస్తున్నారట. ఈ చిత్రానికి నిర్మాత, తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'నేను, గోపీ మోహన్ తొలి సారిగా బాలయ్య సినిమాకు కలిసి పని చేయబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు. ఈచిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీ మోహన్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్లుగా కొనసాగుతున్నారు. ఇద్దరు కలిసి పని చేసిన దూకుడు, కింగ్ చిత్రాల్లో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా పేలాయి. ప్రస్తుతం వీరు జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రంతో పాటు, మంచు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ', వెంకీ 'షాడో' చిత్రాలకు పని చేస్తున్నారు.

బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాబోయే సినిమాలో చేబోతున్నట్లు తెలుస్తోంది. సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోతున్న 'ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X