మహేష్ బాబుకి నో చెప్పిన బాలకృష్ణ!?
నందమూరి బాలకృష్ణ తాజాగా మోహన్ బాబు కుమార్తె నిర్మించే ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రంలో గెస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా శ్రీను వైట్ల తన దూకుడు చిత్రం కోసం బాలకృష్ణను ఓ గమ్మత్తైన గెస్ట్ క్యారెక్టర్ కి అడిగారని తెలుస్తోంది.అయితే బాలకృష్ణ నిర్విర్దంగా నో చప్పినట్లు చెప్తున్నారు. మహేష్ సైతం ట్రై చేసినా కాదన్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక దూకుడు చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. సమంత అతని ప్రక్కన హీరోయిన్ గా చేస్తోంది. నమో వెంకటేశ చిత్రం అనంతరం అదే నిర్మాతలకు శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం ఇది. కామిడీ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్తున్నారు.16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'దూకుడు" టైటిల్ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో 'నీ దూకుడుకు సాటెవ్వడు..." అంటూ సాగే ఓ సాంగ్ ని సైతం పెట్టారు. వినాయకుడు ఫేం సోనియా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో కనపించనుంది.


Click it and Unblock the Notifications











