twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథానాయకుడు దెబ్బతో బాలయ్య సంచలన నిర్ణయం.. నష్టాల షాక్ నుంచి తేరుకుని!

    |

    Recommended Video

    NTR Kathanayakudu : Balakrishna Takes Sensational Decision On Mahanayakudu | Filmibeat Telugu

    నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈచిత్ర వసూళ్లు ఏ దశలోనూ ఆశాజనకంగా లేవు. చిత్రానికి మంచి టాక్ వచ్చినా, బాలయ్య నటన అదుర్స్ అనిపించినా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం చూడడానికి జనాలు ఆసక్తి చూపలేదు. అన్ని ఏరియాలలో ఈ చిత్ర బయ్యర్లు తీవ్రమైన నష్టాలని చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. దీనితో బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    భారీ అంచనాలతో

    భారీ అంచనాలతో

    తన తండ్రి జీవిత చరిత్ర కాబట్టి బాలయ్య స్వయంగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. 9 మంది హీరోయిన్లు కామియో రోల్స్ లో నటించారు. రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రానికి 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. సంక్రాంతి సీజన్ ఉండడంతో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తే 70 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదు అని ట్రేడ్ విశ్లేషకులు కూడా భావించారు.

     అంచనాలు తలకిందులు చేస్తూ

    అంచనాలు తలకిందులు చేస్తూ

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలయ్యాక ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఏ దశలోనూ ఈ చిత్ర వసూళ్లు పుంజుకోలేదు. తాజాగా ఈ చిత్రానికి వస్తున్న వసూళ్ళని బట్టి బయ్యర్లకు 50 కోట్ల మేర నష్టం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో నష్టం అంటే బయ్యర్లకు పెద్ద షాకే అని చెప్పొచ్చు. దీనితో ఎన్టీఆర్ మహాయకుడు విడుదలపై ఉత్కంఠ నెలకొని ఉంది.

    బాలయ్య సంచలన నిర్ణయం

    బాలయ్య సంచలన నిర్ణయం

    ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కథానాయకుడితో నష్టపోయిన బయ్యర్లకి ఆదుకునేందుకు బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు ఉచితంగా ఇవ్వాలని బాలయ్య నిర్ణయించాడట. దీనిద్వారా బయ్యర్లు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి హిట్ టాక్ వస్తే ఓవరాల్ గా లాభాలని అందుకోవచ్చు.

    <strong>బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!</strong>బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!

    విడుదల వాయిదా

    విడుదల వాయిదా

    మరో వైపు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదుల చేయాలని పలువురు బాలయ్యకు సూచిస్తున్నారట. ఎన్టీఆర్ మహాయానాకుడు చిత్రం మొత్తం రాజకీయ అంశాలతో ఉండబోతోంది.

    English summary
    Balakrishna sensational decision on NTR Mahanayakudu after NTR Kathanayakudu fails at Box office
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X