రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాలకృష్ణ.. అసలు ఏమైందంటే?

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో ఆయన నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో రెమ్యూనరేషన్ మాట్లాడడం కోసం వెళ్లిన నిర్మాతలకు ఊహించని విధంగా బాలకృష్ణ షాక్ ఇచ్చారు అని అంటున్నారు. చాలా కాలం పాటు సరైన హిట్ సినిమాలు లేక వరుస ఫ్లాప్ సినిమాలు అందుకున్న బాలకృష్ణ అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు

. యపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పటి వరకు కరోనా కారణంగా థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే మీమాంసలో ఉండగా అఖండ కోసం ఏకంగా కొన్ని చోట్ల పాత రోజుల్లో లాగా ట్రాక్టర్లు కట్టుకుని మరీ సినిమాలకు వెళ్లి తెలుగు సినిమా బాగుంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

Balakrishna shocks mythri movie makers over remuneration

ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో బాలకృష్ణ ఇక మీదట మాస్ కథలు ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా ఒప్పుకున్నారు. తొలుత గోపీచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి కథ చెప్పి ఒప్పించుకుని ఆ తరువాత నందమూరి బాలకృష్ణ కు కథ చెప్పి ఒప్పించారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తాను మాట్లాడలేనని గోపీచంద్ మలినేని చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత లు బాలకృష్ణ దగ్గరకు వెళ్లారట. ఇదంతా కూడా అఖండ విడుదలైన వారం పది రోజుల గ్యాప్ లో జరిగింది. అఖండ సూపర్ హిట్ కావడంతో ఆయన తన రెమ్యునరేషన్ లో నలభై నుంచి యాభై శాతం పెంచే అవకాశం ఉందని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి అక్కడకు వెళ్లారట..

అయితే బాలకృష్ణ మాత్రం అలా కాకుండా అఖండ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే మరో కోటి రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి షాక్ ఇచ్చారు. బాలకృష్ణ అఖండ సినిమా కోసం 11 కోట్ల రూపాయలు దానితోపాటు జీఎస్టీ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు తెరకెక్కుతున్న 107 సినిమాకు సంబంధించి 12 కోట్ల రూపాయలతో పాటు జీఎస్టీ అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అఖండ విడుదలకు ముందు ఆయనకు 9 కోట్ల రూపాయలు మాత్రమే అందాయట. అఖండ విడుదలైన తర్వాత మరో రెండు కోట్ల రూపాయలను నిర్మాత తీసుకువచ్చి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. కానీ ఇలాంటి అనుభవం మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదని వారు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X