Balakrishna: చంద్రబాబు అరెస్టు... బాలయ్య ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
స్కిల్ డెవెల్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహ్యారంలో బాలకృష్ణ సైతం కల్పించుకుని టీడీపీ బాధ్యతలు భుజాన వేసుకుని మోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టు వల్ల బాలయ్య ఫ్యాన్స్ కు నిరాశ చెందే విషయం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది.. ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవెల్మెంట్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, లోకేష్, నటసింహం బాలయ్య సైతం కలిసి మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పారు.

ఆ విషయం పక్కన పెడితే.. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేగుతోంది. దానికి తోడు టీడీపీ బాధ్యతలు అన్ని బాలకృష్ణ తన భూజాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు. అన్నిట్లో ముందుండి అందరికీ దైర్యం చెబుతూ... బాలయ్య పనులు దగ్గరుండి చేపిస్తున్నాడు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు మొన్న పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే బాలయ్య తన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనితో ఆయన నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 80శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా... ఇప్పుడు బాలయ్య రాజకీయాల్లో బిజీ అవ్వడంతో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరి షూటింగ్ ఇంకా కాస్త మిగిలే ఉందట. బాలయ్య వస్తేనే ఈ సినిమా పూర్తి కానుందని తెలుస్తోంది. విడుదల తేదీకి ఇంకా నెలరోజుల సమయం ఉంది. అందులోనూ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలి. ఇలాంటి సమయంలో బాలయ్య రాజీకీయాల్లో బిజీ కావడంతో.. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలయ్య ఫ్యాన్స్ కు ఈ వార్త విని నిరాశ చెందుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. హీరోయిన్ శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తుంది. అక్టోబర్ 19న రిలీజ్ కావాల్సి ఉంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఏమైనా ప్రకటిస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











