Just In
Don't Miss!
- Finance
5 నెలల్లో రూ.8500 తగ్గిన బంగారం, వెండి రూ.14,000 డౌన్: 2009 తర్వాత తొలిసారి...
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తాప్సీని పట్టుకున్న బాలకృష్ణ
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'హరహరమహదేవ" చిత్రానికి ఇప్పటిదాకా హీరోయిన్‌ను ఎంపిక కాలేదన్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా తాప్సీ ఈ చిత్రంలో హీరోరదయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తమిళంలో కూడా తాప్సీ హవా కొనసాగిస్తోకన్న ఆమె తనకు వచ్చిన ఏ అవకాశమూ వదిలేటట్లు లేదు.దాంతో బెల్లంకొండ ఆమెను సంప్రదించి ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌తో కలిసి 'మొగుడు"చిత్రం చేస్తోంది. బాలకృష్ణ కధానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకస్వామి ఆశీస్సులతో మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేష్ 'హర హర మహాదేవ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్యన హైటెక్స్ లో జరిగింది. అప్పుడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ 'ముహూర్తానికి 25 డైలాగులు రాసాము. అందులో ఓ డైలాగును ప్రారంభదృశ్యంలో బాలకృష్ణ గారు చెప్పారు. అది 'సై అంటే శరభ శరభ... జై అంటే ఆయుష్మాన్ భవ... కాదని ఎదురొస్తే హరహర మహాదేవ'. ఈ సినిమా చాలా పవర్ ఫుల్ డైలాగులతో వుంటుంది. అద్భుతమైన పాత్ర బాలయ్య చేస్తున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత బాలయ్య సినిమాకు పనిచేస్తున్నాము. మంచి ఆకలితో ఉన్నాము. సినిమా కసిగా చేస్తున్నాము' అన్నారు. మరి తాప్సీ వచ్చి చేరింది కాబట్టి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందేమో చూడాలి.