ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే బాలయ్య మళ్లీ..?
హైదరాబాద్: బాలకృష్ణ ముఖ్యమైన అతిథి పాత్రలో నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు శేఖర్ రాజా ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా తెరకెక్కించ లేక పోయారు. ఫలితంగా బాలయ్య పోయి పోయి ఇలాంటి సినిమాలో అతిథి పాత్ర చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారనే విమర్శలు సైతం వినిపించాయి.
తాజాగా ఆ ప్లాపు దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారట నట సింహం బాలకృష్ణ. ఇప్పటికే శేఖర్ రాజా బాలయ్య కోసం స్క్రిప్టు రెడీ చేశాడని, బాలయ్య కూడా సముఖంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం బాలకృష్ణ శ్రీమన్నారాయణ చిత్రంలో నటిస్తున్నారు. రవి చావలి దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ బేనర్‌పై పుప్పాల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఆగస్టు చివరి వారంలోనే ఈచిత్రం విడుదల కాబోతోంది.
మరో వైపు బాలయ్య ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'ఆదిత్య 999' చిత్రంలో నటించబోతున్నారు. దీంతో పాటు 'శ్రీకృష్ణ దేవరాయలు' చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











