‘సింహం’ లేదంటూ సెంటిమెంట్ తో బెగ్గపెట్టుకొన్న బాలయ్య...
గతంలో బాలకృష్ణ సినిమాలకి ఏ పేరు పెట్టినా ఆడేసేవి కానీ ఈమధ్య మాత్రం పేరులో సింహం లేకపోతే అభిమానులే ఆ సినిమాని లైట్ తీసుకుంటున్నారు. 'సమరసింహా రెడ్డ" నుంచి 'సింహాఈ వరకు బాలకృష్ణ చవిచూసిన విజయాలన్నిటిలో సింహముంది. నరసింహనాయుడు, లక్ష్మీనరసింహాతో కలిపి గత పన్నెండేళ్లో బాలకృష్ణ చవిచూసినవి నాలుగే హిట్లు. వాటన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ సింహం. కానీ 'పరమవీర చక్ర" టైటిల్ లో సింహం లేకపోయేసరికి అసలే సెంటిమెంట్లకి ప్రాణమిచ్చే బాలకృష్ణ టెన్షన్ తో జుట్టు పీక్కుంటున్నాడు. ఇప్పటికిప్పుడుటైటిల్ మారిస్తే ఎలా ఉంటుందని కూడా బాలయ్య అనుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.
అయితే పోస్టర్లు ప్రింట్ అయి డబ్బాలు కూడా బయల్దేరే టైమ్ కి బాలయ్యకిదేం చిలిపి కోరిక అంటూ నిర్మాత షాకవుతున్నాడు. ఈ సారికి ఇలా కానిచ్చేసి ఇకవేళ పరమవీరచక్ర బాక్సాఫీస్ వద్ద పరమపదిస్తే అప్పుడిక తన సినిమాలన్నింటికీ సింహం అనే టైటిల్ పెట్టుకోవాలని బాలయ్య భావిస్తున్నాడు. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ కానీ, సింపుల్ గా బాలయ్య సినిమాలకి సింహా1, సింహా2 అంటూ ఒక సిరీస్ నడిపితే టైటిల్స్ వెతుక్కోవాల్సిన సమస్య తలెత్తదు అంటున్నారు సినీ పక్షులు...


Click it and Unblock the Notifications











